‘రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం’
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:34 AM
ప్రతి గ్రామానికి రహదారి నిర్మించ డానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అన్నారు.
బెలగాం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామానికి రహదారి నిర్మించ డానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అన్నారు. శుక్రవారం పార్వతీపురం నుంచి వల్లరి గుడబ వరకు రూ.2 కోట్లతో నిర్మించనున్న రోడ్డుకు పట్టణంలో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్వతీపురం నుంచి వల్లరిగుడబ వరకు ఉన్న రోడ్డు అధ్దానంగా ఉందని, వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రోడ్డు నిర్మా ణానికి చర్యలు చేపట్టామ న్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఏపీఆర్‌డీసీ డైరెక్టర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, కొప్పుల వెలమ డైరెక్టర్ గొట్టాపు వెంకట నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు బోను చంద్రమౌళి పాల్గొన్నారు.