Share News

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:00 AM

రైతులు ఎదు ర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు తెలిపారు.

 సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
అధికారులతో మాట్లాడుతున్న ఆర్డీవో రామ్మోహనరావు :

రామభద్రపురం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రైతులు ఎదు ర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు తెలిపారు. మండలంలోని నర్సాపురంలో శనివారం కొత్త పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన తప్పులు సరిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంకా ఏమైనా తప్పులు ఉన్నట్లైతే గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కొత్త పాసుపుస్తకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలో ఇప్పటివరకు ఎన్ని కొత్త పాసుపుస్తకాలు పంపిణీ చేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ వేగవంతం చేసి రైతులందరికీ పాసుపుస్తకాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కోట వెంకటనాయుడు, తహసీల్దార్‌ అజు రఫీ జాన్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 12:00 AM