ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:16 AM
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యం త ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు.
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
పీజీఆర్‌ఎస్‌లో 183 వినతులు
విజయనగరం, కలెక్టరేట్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యో తి): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యం త ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పీజీ ఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల ద్వారా ఆయన వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 183 విన తులు వచ్చాయి. వచ్చిన వినతులను కలెక్టర్ తోపాటు జేసీ సేతు మాధవన్, డీఆర్వో చందక సత్తిబాబు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వినతులు స్వీకరించారు.
అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలి..
భూములకు సంబంధించి వచ్చిన అర్జీలను రీ ఓపె న్ కాకుండా చూడాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్ కార్యాల యంలో ఆయన జిల్లా అధికారులతో పీజీఆర్‌ఎస్ విన తుల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీదారలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను వివరంగా తెలు సుకోవాలని సూచించారు.
చట్ట పరిధిలో పరిష్కరించాలి: ఎస్పీ దామోదర్
విజయనగరం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లా లోని పోలీసుస్టేషన్ల పరిధిలో బాధితుల సమస్యలను చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ దామోదర్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి.. 25 ఫిర్యాదులు స్వీకరిం చారు. ఈ కార్య క్రమంలో ఏఎస్‌పీ సౌమ్యలత, సీఐ కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.