కార్యకర్తల సమస్యలకు ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:21 AM
కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు.
గుమ్మలక్ష్మీపురం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు. బుధవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత సమర్థంగా తీసుకెళ్లాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ఓటర్ల చేర్పులు, మార్పులపై చర్చించి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు.