ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:19 AM
ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో భాగం గా ప్రజలిచ్చే వినతులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు.
ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
విజయనగరం రూరల్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో భాగం గా ప్రజలిచ్చే వినతులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆమె ప్రజాదర్బార్ నిర్వ హించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రోడ్లు, కాలువలు, ఇళ్లు, ఇంటి రుణాలు, ఉద్యోగ, ఉపాధి అవ కాశాలు కల్పించాలని కోరుతూ వినతులు వచ్చాయి. వచ్చిన వినతులను ఆన్‌లైన్ చేసి, సంబంధిత విభా గాలకు పంపనున్నట్టు చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యా యులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘ నేతలు ఎమ్మెల్యేకు వినతిని సమర్పించారు.