Share News

గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం

ABN , Publish Date - May 31 , 2026 | 12:06 AM

గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయోత్పత్తి పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి అన్నారు.

గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం
వ్యవసాయ ఉపకరణాలను అందజేస్తున్న ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, మే 30 (ఆంధ్రజ్యోతి): గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయోత్పత్తి పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి అన్నారు. శనివారం క్యాంప్‌ కార్యాలయంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు 75 శాతం రాయితీపై టార్పాలిన్లు, ఆయిల్‌ ఇంజన్లు, విత్త నాలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉపకరణాలు, విత్తనాలు వ్యవ సాయ దిగుబడులు పెంచడంతో పాటు రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి లబ్ధిదారుడికి చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐదు మండలాల వ్యవసాయశాఖ అధికారులు, ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2026 | 12:06 AM