Share News

శ్రామికుల సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:55 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కళ్యాణ్‌ శ్రామికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.

 శ్రామికుల సంక్షేమానికి  ప్రాధాన్యం
డెంకాడ: వేతనదారులకు టార్పాలిన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే నాగమాధవి:

డెంకాడ, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కళ్యాణ్‌ శ్రామికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. బుధవారం మండలంలోని పినతాడివాడ, వెదుళ్లవలసలో ఉపాధిహామీ పనుల శ్రామికులతో మాట్లాడారు. మండుటెండల నుంచి ఉపశమనం కలిగించేలా ఉపాధిహామీ శ్రామి కులకు ఎమ్మెల్యే టార్పాలిన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బంటుపల్లి వెంకట వాసుదేవరావు, టీడీపీ మండలాధ్యక్షులు పల్లె భాస్కరరావు, మహిళా కోఆర్డినేటర్‌ తుమ్మి లక్ష్మీరాజ్‌, జనసేన మండల కోఆర్డినేటర్‌ పైలా శంకర్‌, జొన్నాడ పీఏసీఎస్‌ అధ్యక్షుడు భవిరివెడ్డి శ్రీనివాసరావు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మహంతి ఉమా మహేశ్వరరావు, తొత్తడి ప్రకాష్‌, సిరికి అప్పారావు పాల్గొన్నారు.

సీహెచ్‌సీ పరిశీలన

భోగాపురం, జూన్‌10(ఆంధ్రజ్యోతి): ఆపుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలం దించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సూచించారు. భోగాపురం పంచా యతీ పరిధిలోగల సుందరపేట సమీపంలోగల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొల్లుత్రినాథ్‌, వైద్యులు షాలిని, అలేఖ్య, గొర్లి, లక్ష్మి, రాము, సునీల్‌, రమ్య, నాయకులు వందనాల రమణ పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 11:55 PM