Share News

మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:48 PM

మహిళల సంక్షేమం, ఆర్థిక స్వాలంబనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.

మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
మహిళా వనరుల కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే లోకం నాగమాధవి

- ఎమ్మెల్యే నాగమాధవి

భోగాపురం, అక్టోబరు13(ఆంధ్రజ్యోతి): మహిళల సంక్షేమం, ఆర్థిక స్వాలంబనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. మండల కేంద్రంలో వెలుగు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా వనరుల కేంద్రాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల అన్ని సమస్యలకు ఒకే చోట పరిష్కారం లభించేవిధంగా ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్థిక సాధికారత, న్యాయ సహాయం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, బాల్య వివాహాల నిర్మూలన కోసం ఈ కేంద్రాన్ని సంపద్రించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో డీడీ స్వరూపరాణి, సీఐ కె.దుర్గాప్రసాదరావు, ఏసీఎం జగదీష్‌, పల్లంట్ల జగదీష్‌, వందనాల రమణ, పడాల శ్రీనివాసరావు, గుండపు సూర్యారావు, మట్టా అయ్యప్ప రెడ్డి, శిరుగుడి వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారులకు అండగా ఉంటాం..

మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. ముక్కాం గ్రామంలో మంగవారం ప్రభుత్వం మంజూ రు చేసిన ఉచిత బియ్యాన్ని ఆమె మత్స్యకారులకు అందజేశారు. తుఫాన్‌తో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు పభుత్వం బియ్యం, నిత్యావసర సరుకులు అందజేస్తుందని ఆమె తెలిపా రు. నియోజకవర్గంలో 8,629 మత్స్యకార కుటుంబా లకు 4,31,450 కిలోల బియ్యం అందజేస్తామని అన్నా రు. కార్యకమ్రంలో పౌరసరఫరాల అధికారి బీవీ ము రళీ పాల్గొన్నారు. చేపలకంచేరులో రూ.12లక్షలతో నిర్మించనున్న మత్స్యకారుల సామాజిక భవనానికి ఎమ్మెల్యే మాధవి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వందనాల రమణ, అయ్యప్పరెడ్డి, తదితర నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 11:48 PM