గెలిచే అవకాశమున్న వారికి ప్రాఽధాన్యం
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:08 AM
గెలిచే అవకాశాలు ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కురుపాం నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు ఎం. వెంకటేష్ సూచించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్య ర్థుల గెలుపునకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
కురుపాం నియోజకవర్గం టీడీపీ పరిశీలకుడు వెంకటేష్
గరుగుబిల్లి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): గెలిచే అవకాశాలు ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కురుపాం నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు ఎం. వెంకటేష్ సూచించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్య ర్థుల గెలుపునకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. శుక్రవారం తోటపల్లిలో టీడీపీ మండలాధ్యక్షుడు మరడాన నారాయణస్వామి అధ్యక్షతన మండల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తదుపరి బీసీలకు రిజర్వేషన్ 50 శాతం మేర ప్రకటించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్ని కలను అడ్డుకునేందుకు గొడ్డలిపార్టీ విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదన్నా రు. కార్యక్రమంలో రాష్ట్రకార్పొరేషన్ డైరెక్టర్లు ఎ.తవిటినాయుడు, ఎ.మధుసూ దనరావు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ఎం.తవిటినాయుడు, ఉరిటి రా మారావు, ఎం.పురుషోత్తంనాయుడు, డి.సత్యనారాయణ, డి.ధనుంజయరావు, ఉషా సరస్వతి పాల్గొన్నారు.
కేంద్ర కార్యాలయానికి ఆశావహుల పేర్లు
కొమరాడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ మండలాధ్యక్షుడు శేఖర్పాత్రుడు కోరారు. శుక్రవారం కొమ రాడ మండల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కురపాం నియోజకవర్గ పరిశీలకుడు మాదారపు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈసందర్భగా మాట్లాడుతూ మండలంలోని 15 ఎంపీటీసీలు, జడ్పీ టీసీకి అభ్యర్థుల ఎంపికపై చర్చించి ఆశావహులు పేర్లను పార్టీ కేంద్ర కార్యా లయానికి పంపనున్నట్లు తెలిపారు.