దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:13 AM
దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధా న్యత ఇస్తోందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు.
రాజాం ఎమ్మెల్యే కోండ్రు
రాజాం, అక్టోబరు 9(ఆంధ్రజ్యో తి): దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధా న్యత ఇస్తోందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. శుక్ర వారం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన ఆరుగురు దివ్యాంగులకు ఆయన మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నంది సూర్యప్రకాష్ రావు, తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొల్ల అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బొత్స వాసుదేవరావునాయుడు, గురవాన నారాయణరావు, వల్లూరు గణేష్, గట్టి భాను తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం..
రాజాం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు. పెనుబాక గ్రామంలో జలజీవన్ మిషన్ అమరజీవి జలధార పథకం ద్వారా మంజూరైన కుళా యిలకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నంది సూర్యప్రకాష్‌రావు, పార్టీ నాయకులు గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, వంగా వెంకటరావు, కొల్ల అప్పలనాయుడు, బొత్స వాసు దేవరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు.