గిరిజన ప్రాంతాల్లో రహదారులకు ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:07 AM
గిరిజన ప్రాంతాల్లో రహదారులు ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నామని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు.
కొమరాడ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో రహదారులు ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నామని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. బుధవారం సీసాడవలస నుంచి నయాకు రూ.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏజెన్సీ గ్రామాల్లో డోలీ మోతలు లేకుండా ఉండేందుకు కొత్తగా రహదారులను మంజూరు చేసిందన్నారు. రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు ఉదయ్‌శేఖర్ పాత్రుడు, మధసూదనరావు, దేవకోటి వెంకటనాయుడు, వెంకటనాయుడు, గౌరీశంకరరావు, రాఘవ, భానోజీరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.