ఏజెన్సీలో రహదారులకు ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:16 AM
ఏజెన్సీలో రహదారులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
సాలూరు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో రహదారులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం కోటుపరువు పంచాయతీ పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యం ఎంతో కీలకమన్నారు. రోడ్లు అందుబాటులోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువవుతాయ న్నారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిం దన్నారు. గిరిజన గ్రామాలకు డోలీ మోతల రోజులు పోయాయని, రాబోయే రోజుల్లో ప్రతీ గ్రామానికి రోడ్డు, తాగునీరు, విద్య అందించేందుకు కృషి చేస్తు న్నామన్నారు. అనంతరం యరగడవలస గ్రామంలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్క రించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలు వురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.