ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:11 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.
శృంగవరపుకోట, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరిం చుకుని చేపడుతున్న సేవా సంకల్ప్ అభియాన్-2026లో భాగంగా మంగళవారం ఎస్.కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. వీటికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. టీబీ బాధితులకు మందులతో పాటు రూ.1000 చొప్పున పోషకాహార భృతి అందిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు డోకుల చినఅచ్చంనాయుడు, పీఏసీఎస్ చైర్మన్ జీఎస్ నాయుడు, దాసరి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్లు నానిగిరి రమణాజీ, బంగారు నాయుడు, చెక్కా కిరణ్‌కుమార్, బీజేపీ నాయకుడు కొట్యాడ లోకాభిరామకోటి, సూపరింటెండెంట్ నీల, వైద్యుడు మల్ల వేణు తదితరులు పాల్గొన్నారు.
ఎస్.కోట నియోజకవర్గానికి రూ.30 కోట్ల నిధులు
లక్కవరపుకోట(కొత్తవలస), సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పల్లె పండు గ 3.0 ద్వారా ఎస్.కోట నియోజకవర్గానికి రూ.30 కోట్లు నిధులు మంజూరయ్యా యని వాటిని ఐదు మండలాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. మంగళవారం ఆమె కొత్తవసలస మండలం రాజపా త్రునిపాలెంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పల్లెపండుగ ద్వారా రూ.11వేల కోట్ల నిధులు కేటాయించి 15వేల కిలోమీటర్ల సీసీ, బీటీ రోడ్డు నిర్మాణా నికి నాంది పలికిందన్నారు.