Share News

తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రాధాన్యం.. విజయనగరానికి 11 కొత్త తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:04 AM

Priority for maternal and child health తల్లీబిడ్డల ఆరోగ్యం, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యంఇస్తోందని కలెక్టర్‌ ఎస్‌.రామసుందరరెడ్డి అన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల సురక్షిత ప్రయాణం కోసం జిల్లాకు కేటాయించిన 11 నూతన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను మంగళవారం కలెక్టరేట్‌ ఆవరణలో ఆయన ప్రారంభించారు.

తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రాధాన్యం.. విజయనగరానికి 11 కొత్త తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

తల్లీబిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యం

జిల్లాకు 11 వాహనాలు మంజూరు

కలెక్టర్‌ రామసుందరరెడ్డి

విజయనగరం రింగురోడ్డు/ కలెక్టరేట్‌, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి):

తల్లీబిడ్డల ఆరోగ్యం, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యంఇస్తోందని కలెక్టర్‌ ఎస్‌.రామసుందరరెడ్డి అన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల సురక్షిత ప్రయాణం కోసం జిల్లాకు కేటాయించిన 11 నూతన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను మంగళవారం కలెక్టరేట్‌ ఆవరణలో ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, నవజాత శిశువులను ఆసుపత్రి నుంచి సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వం వీటిని అందించిందన్నారు. ఈ వాహనాల వల్ల గ్రామీణ.. మారుమూల ప్రాంతాలకు చెందిన తల్లులకు ఎంతగానో ప్రయోజనం ఉంటుందన్నారు. తల్లీబిడ్డల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాల్లో ఎయిర్‌బ్యాగులు, సీటు బెల్టులు తదితర అధునాతన భద్రతా సదుపాయాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అగ్నిమాపక సిలిండర్లు కూడా ఉన్నాయన్నారు. తీవ్రమైన రక్తహీనతతో ఉండే గర్భిణుల కోసం పికప్‌,డ్రాప్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాకు కొత్తగా వచ్చిన 11వాహనాల్లో 8వాహనాలు జిల్లా ఆసుపత్రికి, రెండు వాహనాలను ఏరియా ఆసుపత్రులకు, ఒక వాహనాన్ని బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 22తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు, డీఎంహెచ్‌ఓ జీవనరాణి, డీసీహెచ్‌ఎస్‌ పద్మశ్రీ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ అల్లు పద్మజ, ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ సేవల కోఆర్డినేటర్‌ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి

దేశం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కలెక్టరు రామసుందర్‌ రెడ్డి సూచించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల12 నుంచి 14 వరకూ ప్రతి మండలం, డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఆగస్టు 15న స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చేతులమీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా దేశం ఏం సాధించాలనుకుటోంది? 2047 నాటికి మన రాష్ట్రం, దేశం ఎలా ఉండాలో అనే అంశంపై తమ అభిప్రాయాలను పంచుకోవాలన్నారు. ఇందుకోసం 30 సెక్షన్ల సెల్ఫీవీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలని కోరారు.

Updated Date - Aug 12 , 2026 | 10:52 AM