మౌలిక వసతులకు ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:08 AM
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.
శృంగవరపుకోట ఎమ్మెల్యే లలితకుమారి
శృంగవరపుకోట ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. గురువారం మండలంలోని సీతంపేట, వినాయకపల్లి, ఎల్.కోట మండలంలోని కళ్లే పల్లిలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కోళ్ల బాలాజీ అప్పలరామప్రసాద్, ఎల్.కోట మండల పార్టీ అధ్యక్షుడు కరెండ్ల ఈశ్వరరావు, కొత్తవలస మార్కెట్ కమిటి చైర్మన్ చోక్కాకుల మల్లునాయుడు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు డోకుల చిన అచ్చంనాయుడు పాల్గొన్నారు.
లక్కవరపుకోట, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ పనిచేస్తుందని, వారికి ఏ కష్టం వచ్చినా టీడీపీ అండగా ఉంటుందని శృంగవరపుకోట ఎమ్మెల్యే లలితకుమారి తెలిపారు. కల్లేపల్లిలో గతనెలలో భోగాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త మండల శ్రీను మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, మృతిని తల్లి మండల బంగారమ్మకు రూ.ఐదు లక్షలను ఎమ్మెల్యే దంప తులు అందజేశారు. అలాగే కల్లేపల్లిలో పీహెచ్‌సీభవన నిర్మాణస్థలం ఉత్తర్వులను ఎమ్మెల్యే లలితకుమారి వైద్యులు అజయ్‌కుమార్, తేజలకు అందజేశారు.