Share News

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:02 AM

కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన పేర్కొన్నారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
బొబ్బిలి రూరల్‌: ప్రభుత్వ పథకాల కరపత్రం అందజేస్తున్న బేబీనాయన:

బొబ్బిలి రూరల్‌, ఆగస్ట్‌ 4(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కింతలివానిపేటలో తాగు నీటి సమస్యపై బేబీనాయన గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థులు ఇటీవల బొబ్బిలి కోటలో ఎమ్మెల్యేను కలిసి తాగునీటి సమస్యని వివరించారు. ఈమేరకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ విశ్వతేజతో మాట్లాడి సమస్యను అత్యవసరంగా పరిగణించి, పరిష్కరించి స్వచ్ఛమైన తాగునీరందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పఽథకాలను వివిరించారు.

బొబ్బిలి వీణకు వందల ఏళ్ల చరిత్ర

బొబ్బిలి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి వీణకు వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉందని, నేటి ఆధునిక కాలంలో మరోసారి ఆ సంగీత వీణ ప్రత్యేకతను, ప్రాముఖ్య తను ప్రపంచానికి చాటిచెప్పినట్లయ్యిందని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. బొబ్బిలి ప్రాంతానికిగల ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహూకరించిన వీణను తయారుచేసిన కళాకారుడు మన వాడని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసేందుకు ఇటీవల విచ్చేసిన ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు బొబ్బిలి వీణను జ్ఞాపికగా అందజేసిన సంగతి తెలిసిందే. ఆ వీణను బాడంగి మండలంలోని వాడాడకు చెందిన బోనుమద్ది మురళి ఏకరూప పనస (ఏకండీ) కలప తో తయారుచేశాడు. ఈ మేరకు వీణ తయారీ కళాకారుడు మురళిని మంగళవారం బొబ్బిలికోటకు ఎమ్మెల్యే బేబీనాయన ఆహ్వానించారు. గొల్లపల్లి వీణల తయారీకేంద్ర కళాకారులు, గ్రామపెద్దల సమక్షంలో మురళిని ఎమ్మెల్యే సత్కరించారు.

Updated Date - Aug 05 , 2026 | 12:02 AM