ధర్నాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:12 AM
విజయనగరం సబ్ డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్ష ణలో భాగంగా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాల నిర్వహ ణకు ముందస్తు అనుమతులు తప్పనిసరని విజయన గరం డీఎస్పీ రాఘవులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయనగరం డీఎస్పీ రాఘవులు
విజయనగరం దాసన్నపేట, జూలై 9(ఆంధ్రజ్యోతి): విజయనగరం సబ్ డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్ష ణలో భాగంగా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాల నిర్వహ ణకు ముందస్తు అనుమతులు తప్పనిసరని విజయన గరం డీఎస్పీ రాఘవులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతులు పొందకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే, చట్టపర మైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెక్షన్ 30 పోలీసు చట్టాన్ని ఆగస్టు-8 వరకూ అమలు చేస్తున్నామ ని తెలిపారు. పోలీసు శాఖ నుంచి ముందస్తు అను మతి తీసుకోకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం చట్ట విరుద్ధమన్నారు. చట్టాన్ని గౌరవిం చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. అందుకు అణుగుణంగా ప్రతిఒక్కరూ నడుచుకుని శాంతియుతం గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు జరిపే ముందు డీఎస్పీ కార్యాల యంలో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాల న్నారు. నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు, సభలు నిర్వహిస్తే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.