Share News

Electrical Accidents విద్యుత్‌ ప్రమాదాల నివారణే లక్ష్యం

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:04 AM

Preventing Electrical Accidents Is the Goal విద్యుత్‌ ప్రమాదాల నివారణే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ పి.త్రినాథరావు తెలిపారు. విద్యుత్‌ భద్రత, ప్రమాదాల నివారణపై మంగళవారం ఏపీఈపీడీసీఎల్‌ పార్వతీపురం మన్యం సర్కిల్‌ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు

 Electrical Accidents  విద్యుత్‌ ప్రమాదాల నివారణే లక్ష్యం
అవగాహన ర్యాలీ ప్రారంభిస్తున్న ఎస్‌ఈ త్రినాఽథరావు

  • జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ

పార్వతీపురం టౌన్‌/ బెలగాం, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ప్రమాదాల నివారణే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ పి.త్రినాథరావు తెలిపారు. విద్యుత్‌ భద్రత, ప్రమాదాల నివారణపై మంగళవారం ఏపీఈపీడీసీఎల్‌ పార్వతీపురం మన్యం సర్కిల్‌ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. విద్యుత్‌ వైర్లపై తడి బట్టలతో గాని, తడి చేతులతోగాని ఎవరూ తాకరాదన్నారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్‌ వైర్లు తెగిపడే అవకాశం ఉంటుందన్నారు. కరెంట్‌ సరఫరా లేదు అనుకుని వాటిని చేతితో గాని, కాలితో గాని తాకరాదని తెలిపారు. విద్యుత్‌ లైన్‌లకు దూరంగా గృహ నిర్మాణాలు చేపట్టాలని, నాణ్యమైన పరికరాలనే వాడాలని వెల్లడించారు. ప్రమాదాల బారిన పడుతున్న భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, షాపుల సిబ్బంది, రైతులకు అవగాహన కల్పించేందుకు విద్యుత్‌ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 12:04 AM