Share News

మత్తు పదార్థాల రవాణాను నిరోధించండి

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:27 AM

మత్తు పదార్థాల రవాణాను సమర్థంగా నిరోధించాలని పార్వతీపురం మన్యం జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ అధికారి కె.సహదేవ్‌ సిబ్బందిని ఆదేశించారు.

 మత్తు పదార్థాల రవాణాను నిరోధించండి
మద్యం దుకాణంలో తనిఖీ చేస్తున్న జిల్లా ఎక్సైజ్‌ అధికారి కె.సహదేవ్‌

కురుపాం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాల రవాణాను సమర్థంగా నిరోధించాలని పార్వతీపురం మన్యం జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ అధికారి కె.సహదేవ్‌ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం కురుపాం ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని మూలిగూడ జంక్షన్‌ చెక్‌ పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌, రెవెన్యూ శాఖల సమన్వయం చేసుకుంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. రాత్రి వేళల్లో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం రావాడ రోడ్డులోని సత్య వైన్స్‌ను తనిఖీ చేసి, మద్యం నిల్వలు, అమ్మకాలు, రికార్డులను పరిశీలించారు. ఎన్నికల సంఘం నిఘా కొనసాగుతున్నందున రికార్డులు పక్కాగా నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో ఎక్సైజ్‌ సీఐ పి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ రాజశేఖర్‌ బాబు ఉన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 12:27 AM