Share News

Local Elections స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:17 AM

Preparing for Local Elections స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి వర్చువల్‌గా సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవససరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలన్నారు.

  Local Elections  స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి వర్చువల్‌గా సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవససరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. స్ర్టాంగ్‌ రమ్‌లు, రూట్‌ మ్యప్‌లు, వాహనాలు, జోనల్‌ రూట్‌ అధికారుల నియామకంతో పాటు సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలని సూచించారు. వాటి వివరాలను పోలీసులకు అందించాలన్నారు. ఎన్నికల సిబ్బందికి ముందుగానే నియామక ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సిబ్బంది నియామకానికి అవసరమైన వివరాలను ముందుగా అందించాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జేసీ ఆర్‌.వైశాలి ఇతర అధికారులు పాల్గొన్నారు.

- ఉపాధి హామీ పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, ఏపీవోలతో సమీక్షించారు. ప్రతి జాబ్‌కార్డుదారునికి 125 రోజుల పని కల్పించాలని, వెనుకబడిన మండలాల్లో ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్‌ సూచిం చారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, థర్డ్‌లేయర్‌ పూర్తయిన తర్వాత బిల్లులు ప్రాసెస్‌ చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు అప్‌లోడ్‌ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంకుడు గుంతలు, శ్మశాన వాటికలు, అవెన్యూ ప్లాంటేషన్‌ పనులను వేగవంతం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించి నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ అర్పిత్‌ రహార్‌, డీఆర్వో హేమలత, డ్వామా పీడీ కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:17 AM