Share News

Rising Star Students రైజింగ్‌స్టార్‌ విద్యార్థులను సన్నద్ధం చేయండి

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:35 PM

Prepare Rising Star Students పదో తరగతి పరీక్షలకు రైజింగ్‌స్టార్‌ ( సీ,డీ గ్రేడ్‌ ) విద్యార్థులను సన్నద్ధం చేయాలని విద్యాశాఖ ఆర్జేడీ ( రీజియన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ) విజయభాస్కర్‌ పిలుపునిచ్చారు.వారు ఆత్మసైర్థ్యంతో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 Rising Star Students రైజింగ్‌స్టార్‌ విద్యార్థులను సన్నద్ధం చేయండి

సాలూరు రూరల్‌, జనవరి 7(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలకు రైజింగ్‌స్టార్‌ ( సీ,డీ గ్రేడ్‌ ) విద్యార్థులను సన్నద్ధం చేయాలని విద్యాశాఖ ఆర్జేడీ ( రీజియన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ) విజయభాస్కర్‌ పిలుపునిచ్చారు.వారు ఆత్మసైర్థ్యంతో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వంద రోజుల ప్రణాళిక అమలు తీరుపై బుధవారం సాలూరు బాలికోన్నత పాఠశాలలో సాలూరు అర్బన్‌,రూరల్‌ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ పార్వతీపురం మన్యం జిల్లా గత మూడేళ్లూ వరుసగా టెన్త్‌ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈసారి కూడా జిల్లా మొదటి స్థానంలో నిలవాలి. పదో తరగతి పరీక్షలను రాసే విధానంలో విద్యార్థులు చేస్తున్న తప్పులను గుర్తించి సరిచేయాల్సి బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. రైజింగ్‌స్టార్‌ విద్యార్థుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి.. తప్పులను సరిదిద్దాలి.’ అని తెలిపారు. అనంతరం వంద రోజుల ప్రణాళిక అమలు, స్లిప్‌ టెస్ట్‌లను నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమీక్షలో పార్వతీపురం డిప్యూటీ డీఈవో బత్తుల రాజకుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 11:35 PM