Local Elections స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:18 AM
Prepare for Local Elections స్థానిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై చర్చించారు.
పార్వతీపురం, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై చర్చించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సన్నాహక పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు పూర్తి అవగాహన, సమగ్ర సమాచారం ఉండాలన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై ఈ నెల 23న ముసాయిదా జాబితా ప్రకటించనున్నట్టు తెలిపారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26లోపు ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందించాలన్నారు. వచ్చిన అభ్యంతరాలు, క్లయిమ్‌లను పరిశీలించిన తర్వాత పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ఈ నెల 31న ప్రకటిస్తామని వెల్లడించారు.
- ప్రతిరోగికి నాణ్యమైన వైద్యసేవలు అందేలా ఆసుపత్రుల రూపురేఖలు మారాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులు, ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. మౌలిక వసతుల సమస్యలను వెంటనే ఈ ఆఫీస్ ద్వారా తన దృష్టికి తీసుకు రావాలన్నారు. పెండింగ్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులను వదిలి ప్రైవేట్‌కు వెళ్లడానికి గల కారణాలను సేకరించాలని సూచించారు.
- విద్యార్థులు భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, వంటగది, పాత్రలు, మరుగుదొడ్లును పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కిచెన్ సిబ్బంది గ్లౌజులు, హెడ్‌క్యాప్, మాస్క్ ధరించాన్నారు. వసతిగృహాల్లో వర్చువల్ తనిఖీలు నిర్వహిస్తూ బీఫోర్ ఆఫ్టర్ ఫోటోలతో నివేదికలు సమర్పించాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు, విద్యార్థి కనీసం ఐదు పూలమొక్కలు నాటి వసతిగృహాల ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. 89 అంగన్‌వాడీ కేంద్రాలకు నెలాఖరులోగా నీటి వసతి కల్పించాలన్నారు. వసతిగృహాలు, గురుకు లాలు, ఏకలవ్య పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేసి.. రన్నింగ్‌వాటర్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తిచేయకుంటే సంబంధిత ఈఈలను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.