Share News

Special Authorities ప్రత్యేకాధికారుల కోసం కసరత్తు

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:35 PM

Preparations Underway for Special Authorities జిల్లాలోని పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీకాలం ఏప్రిల్‌-2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకాధికారుల కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గెజిటెడ్‌ స్థాయి అధికారులను మాత్రమే నియమించాలని పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధిశాఖ జీవో జారీ చేసింది.

  Special Authorities  ప్రత్యేకాధికారుల కోసం కసరత్తు

  • ముగియనున్న సర్పంచ్‌ల పదవీకాలం

పార్వతీపురం, మార్చి21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీకాలం ఏప్రిల్‌-2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకాధికారుల కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గెజిటెడ్‌ స్థాయి అధికారులను మాత్రమే నియమించాలని పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధిశాఖ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో అర్హులైన అధికారులను ఎంపిక చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. గెజిటెడ్‌ స్థాయి అంటే ప్రస్తుతం ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, పశువైద్య, వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులు కని పిస్తున్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో గెజిటెడ్‌ స్థాయిలో ఉన్న ఏఈఈలను ప్రత్యేకాధికారులుగా మినహాయించారు. దీంతో జిల్లా అధికారులు ప్రత్యేకాధికారుల నియామకం కోసం గట్టిగా కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 451 పంచాయతీలు ఉండగా.. పూర్తిస్థాయిలో అధికారుల నియామకం సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏదేమైనా వచ్చేనెల 2 తర్వాత పంచాయతీల్లో ‘ప్రత్యేక’ పాలన ప్రారంభం కానుంది.

Updated Date - Mar 21 , 2026 | 11:35 PM