Adivasi Day ఆదివాసీ దినోత్సవానికి సన్నద్ధం
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:03 AM
Preparations Underway for Adivasi Day గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన జేఏసీ, ఉపాధ్యాయ సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహిస్తాం
సీతంపేట, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి): గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన జేఏసీ, ఉపాధ్యాయ సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 9న సీతంపేట ఐటీడీఏ వేదికగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహిం చనున్నట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. గిరిజనసంఘాల నాయకులు ఆరోజున ఆదివాసీల వేషధారణలతో సిద్ధం కావాలని సూచించారు. వేడుకల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీలు ఏర్పాటుచేస్తామన్నారు. గతంలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో ఎదురైన లోటుపాట్లను ఏజేఏసీ అధ్యక్షుడు బి. శ్రీనివాసరావు ఇన్‌చార్జి పీవో దృష్టికి తీసుకువెళ్లారు. అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని పీవో హామీ ఇచ్చారు. సన్నాహక సమావేశంలో డీడీ ఎం.అన్నాదొర, పాలకొండ డీఎస్పీ రాంబాబు, టీడీపీ ఇన్‌చార్జి పడాల భూదేవి తదితరులు పాల్గొన్నారు.