Share News

Examinations ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 22 , 2026 | 11:44 PM

Preparations for Entrance Examinations జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఈనెల 24న నిర్వహిం చనున్న ఏపీఆర్‌ఎస్‌సీఏటీ, ఏపీఆర్‌జేసీ, డీసీసెట్‌ ప్రవేశ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో హేమలత ఆదేశించారు. ఎటువంటి లోటుపాట్లు తలెత్తరాదని స్పష్టం చేశారు.

  Examinations   ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్వో

  • లోటుపాట్లు తలెత్తరాదు

  • డీఆర్వో హేమలత

పార్వతీపురం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఈనెల 24న నిర్వహిం చనున్న ఏపీఆర్‌ఎస్‌సీఏటీ, ఏపీఆర్‌జేసీ, డీసీసెట్‌ ప్రవేశ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో హేమలత ఆదేశించారు. ఎటువంటి లోటుపాట్లు తలెత్తరాదని స్పష్టం చేశారు. బుధ వారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు సంబం ధించి సర్వం సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలను ముందుగానే సందర్శించి సీటింగ్‌ ఏర్పాటు, గదుల సౌకర్యం వంటివి పరిశీలించాలని సూచించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. పోలీస్‌శాఖ సహకారంతో ప్రశ్నపత్రాల తరలించాలని, పరీక్ష కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని తెలిపారు. వేసవి దృష్ట్యా అత్యవసర మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌తో పారా మెడికల్‌ సిబ్బంది ప్రతి కేంద్రం వద్ద ఉండాలని ఆదేశించారు.

Updated Date - Apr 22 , 2026 | 11:44 PM