ntermediate Practicals ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:06 AM
Preparations Completed for Intermediate Practical Examinations జిల్లాలో 33 కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా నీడలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నట్లు ఇంటర్ మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఐఈవో) వై.నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన విలే ఖర్లతో మాట్లాడుతూ.. ఇంటర్ ప్రయోగ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా మన్నారు.
హాజరుకానున్న 17,530 మంది విద్యార్థులు
బెలగాం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 33 కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా నీడలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నట్లు ఇంటర్ మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఐఈవో) వై.నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన విలే ఖర్లతో మాట్లాడుతూ.. ఇంటర్ ప్రయోగ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా మన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఆదివారం నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18 వరకు జరుగు తాయన్నారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మొత్తంగా 17,530 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, పర్య వేక్షణకు ఫ్లైౖయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్, బృందాలతో పాటు ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించామని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోకి అఽధికారులు, ఇన్విజిలేటర్లు, పోలీస్, వైద్య సిబ్బంది, స్క్వాడ్ అధికారులు, ఇతర సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకురాకూడదన్నారు. ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలు కూడా అనుమతించబోమని తెలిపారు. సిబ్బంది వద్ద గుర్తింపు కార్డులు ఉండాలన్నారు. పరీక్షల సమాచారం అందించేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు.