Share News

Local Elections స్థానిక ఎన్నికలకు సన్నద్ధం

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:46 PM

Preparation for Local Elections స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవు తున్నారు. దీనిలో భాగంగా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల పరిధిలో ఎంతమేర బ్యాలెట్‌ బాక్సులు, తదితర సామగ్రి ఉన్నాయన్న సమాచారాన్ని ఎంపీడీవోల నుంచిఉన్నతాధికారులు సేకరిస్తున్నారు.

 Local Elections  స్థానిక ఎన్నికలకు సన్నద్ధం
గరుగుబిల్లి ఎంపీడీవో కార్యాలయంలో బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తున్న సిబ్బంది

  • బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తున్న సిబ్బంది

గరుగుబిల్లి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవు తున్నారు. దీనిలో భాగంగా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల పరిధిలో ఎంతమేర బ్యాలెట్‌ బాక్సులు, తదితర సామగ్రి ఉన్నాయన్న సమాచారాన్ని ఎంపీడీవోల నుంచిఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు బ్యాలెట్‌ బాక్సులను శుభ్రపర్చడంతో పాటు ఎంతమేర బాక్సులు అవసరం అన్న దానిపై నివేదికలను ఉమ్మడి జడ్పీ సీఈవో, గ్రామ పంచాయతీ అధికారికి నివేదికలు అందించారు. అయితే బ్యాలెట్‌ బాక్సుల కొరత కారణంగా వేరే ప్రాంతం నుంచి తెప్పించే చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 451 పచాయతీలకు గాను 4,144 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను జడ్పీ సీఈవో కార్యాలయానికి అందించారు. పురపాలక పోరు తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా అఽధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. కాగా ఈ నెల 11న ఎంపీటీసీల వారీగా ఓటర్ల జాబితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై డీపీవో ఎస్‌.రవీంద్రను వివరణ కోరగా.. ‘ఎన్నికల సంఘం, రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాం. ఎన్నికలకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఒకవైపు పోలింగ్‌ కేంద్రాలు, మరోవైపు బ్యాలెట్‌ బాక్సులు, తదితర సామగ్రిపై నివేదికలు అందించాం. ఈ నెల 19న రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Sep 09 , 2026 | 11:46 PM