నీటి ఎద్డడి నివారణకు జాగ్రత్తలు
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:44 PM
మున్సిపాలటీ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో మురుగునీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఎ.రామచంద్రరావు హామీ ఇచ్చారు. కాలనీ వాసులు అప్పారావు, పద్మావతి, సత్యనారాయణ, తదితరులు ఫిర్యాదు చేయడంతో కమిషనర్ స్పందించారు.
రాజాం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలటీ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో మురుగునీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఎ.రామచంద్రరావు హామీ ఇచ్చారు. కాలనీ వాసులు అప్పారావు, పద్మావతి, సత్యనారాయణ, తదితరులు ఫిర్యాదు చేయడంతో కమిషనర్ స్పందించారు. గురువారం మురుగునీటి నిల్వలను పరిశీలించారు. కాలువలో ఉన్న పిచ్చిమొక్కలను ముందుగా తొలగించి... మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వచ్చే వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా పట్టణంలో అన్ని బోర్లు పనిచేసే విధంగా చర్యలు చేపడుతున్నామని కమిషనర్ రామచంద్రరావు వివరించారు. గురువారం బోర్లకు సంబంధించిన సామగ్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25లో టెండర్లు వేసిన బోర్‌వెల్ సామాగ్రి ఇప్పుడు వచ్చిందన్నారు. మున్సిపాలిటీలో 204 బోర్లు పని చేస్తున్నాయని చెప్పారు. ఎక్కడైనా బోర్లు మరమ్మతులకు గురైతే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఆయనతో పాటు ఏఈ డి. సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు పరిశీలన
పెనుబాక గ్రామంలో పారిశుధ్య పనులను డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. కాలువల్లో పూడికలు తీయించారు, పూడికలు తీసిన కాలువల్లో బ్లీచింగ్ వేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఇంటి పన్నులు వసూలు తీరును పరిశీలించారు. ఈ నెలాఖరు నాటికి పన్నులు వసూళ్ల లక్ష్యాన్ని పూర్తిచేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇంటి పన్నుల వసూలు విషయంలో ఎటువంటి జాప్యం చేయవద్దని ఆదేశించారు.