Share News

Summer Heat వేసవి తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలి

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:04 AM

Precautions Must Be Taken in View of the Intense Summer Heat ఈ వేసవిలో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. జిల్లా అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 Summer Heat  వేసవి తీవ్రత దృష్ట్యా  జాగ్రత్తలు  పాటించాలి
కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఈ వేసవిలో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. జిల్లా అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేసవి కార్యచరణ ప్రణాళిక-2026పై రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ క్షేత్రస్థాయి సిబ్బందితో మాట్లాడుతూ.. అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవి తీవ్రతపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇందుకోసం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాగునీటి సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని తెలిపారు. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని, తగినంత నీరు తాగాలని సూచించారు. ఈ సమా వేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 12:04 AM