Share News

‘పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించాలి’

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:19 AM

పీఆర్‌సీ చైర్మన్‌ను వెంటనే నియమిం చాలని ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

‘పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించాలి’
నిరసన వ్యక్తం చేస్తున్న యూటీఎఫ్‌ నేతలు

పాలకొండ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పీఆర్‌సీ చైర్మన్‌ను వెంటనే నియమిం చాలని ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ నేతలు డిమాండ్‌ చేశారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 29 శాతం ఐఆర్‌ వెంటనే ప్రకటించాలన్నారు. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలన్నారు. ఉద్యోగుల పెన్షనర్ల కాయిలు చెల్లింపులకు రూట్‌మ్యాప్‌ ప్రకటించాలన్నారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పింఛనఖ అమలు చేయాలన్నారు. హెల్త్‌కార్డులు, మెడికల్‌ బిల్లుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. కోవిడ్‌ సమయంలో మరణించిన 953 పంచాయతీరాజ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలన్నారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవర్‌ జగన్నాథ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్య క్రమంలో ఆంధ్ర ఫెడరేషన్‌ నేతలు హారిక భాస్కరరావు, కుండంగి కృష్ణ, పైడిరాజు, పడాల కాంతారావు, నాగేశ్వరరావు, మహేశ్‌, ప్రమీల, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 12:19 AM