హుకుంపేటలో సిరిమానుకు పూజలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:01 PM
పైడిమాంబ సిరిమానోత్సవం సమీపిస్తుండడంతో హుకుంపేటలో సందడి నెలకొంది.
- సిద్ధమవుతున్న రథాలు
విజయనగరం కల్చరల్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పైడిమాంబ సిరిమానోత్సవం సమీపిస్తుండడంతో హుకుంపేటలో సందడి నెలకొంది. ఇక్కడ సిరిమాను చెట్టుకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో నిత్యం ఈ ప్రాంతం భక్తులతో రద్దీగా కన్పిస్తుంది. మంగళవారం ఉదయం 10 గంటల లోపు సిరిమానుకు పూజలు చేసుకునే అవకాశం ఉండడంతో నగరంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు హుకుంపేటకు వచ్చి సిరిమానుకు పసుపు-కుంకుమలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. మరోవైపు ఆలయ ప్రధాన పూజారి బంటుపిల్లి వెంకటరావు నివాసం వద్ద సిరిమాను, ఇరుసుమాను, మూడు రథాలను సిద్థం చేస్తున్నారు. మరోవైపు వడ్రంగులు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. సోమవారం సాయంత్రానికి సిరిమానుకు సంబంధించిన పనులను పూర్తి చేసేందుకు పూజారి వెంకటరావు చర్యలు తీసుకుంటున్నారు. రథాలకు రంగులు కూడా వేస్తున్నారు. 27న ఉదయం 10 గంటల తరువాత సిరిమానును చదురుగుడికి తరలించే ఏర్పాట్లను పోలీసులు
పైడిమాంబ నిత్యాన్నదానానికి విరాళాలు
పైడిమాంబ ఆలయ అభివృద్ధితో పాటు నిత్యాన్నదానానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన దాతలు విరాళాలు అందజేస్తున్నారు. గుర్ల మండలానికి చెందిన ఆశ్రమ స్వామిజీ సాయిసుందర్ మహారాజ్ రూ.లక్ష, విజయనగరానికి చెందిన అల్లాడ వీరభద్రుడు,చంద్రమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాసకళ్యాణ్ రూ.లక్ష చెక్కును ఆలయ ఈవో, దేవదాయశాఖ సహాయ కమిషనర్ శిరీషకు అందజేశారు.