Share News

సీఎం సూచనలతో ప్రజాదర్బార్‌

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:16 AM

ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు సూచనలతో ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

 సీఎం సూచనలతో ప్రజాదర్బార్‌

  • మంత్రి శ్రీనివాస్‌

విజయనగరం, జూలై 11(ఆంద్రజ్యోతి): ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు సూచనలతో ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహిం చారు. గజపతినగరం నియోజకవర్గంలోని వివిధ గ్రా మాల నుంచి వచ్చిన 32 వినతులను ఆయన స్వీకరిం చారు. ఇందులో అధికంగా విద్యుత్‌ సరఫరాలో లోఓల్టే జీ సమస్యపై వచ్చాయి. అలాగే వెదురువాడలో పంచా యతీ రోడ్డు నిర్మాణం కోసం వినతి వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అన్ని మౌలిక సదు పాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని.. అందులో భాగంగా 200 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామ ని చెప్పారు. త్వరితగతిన సమస్యలు పరిష్కారమ య్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూ చించారు. ఓఎస్‌డీ శ్రీధర్‌రాజా పాల్గొన్నారు.

‘మీరెన్ని సమావేశాలకు హాజరయ్యారో?’

ఈనెల 9వ తేదీన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావే శానికి ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవటంపై వైసీ పీ నేతలు చేసిన ఆరోపణలపై మంత్రి శ్రీనివాస్‌ శని వారం స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్ని సమావేశాలకు హా జరయ్యారో.. గుర్తు తెచుకోవాలని ఎద్దేవా చేశారు. అలా గే నాటి ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది హాజరయ్యిం ది పరిశీలించుకోవాలన్నారు. తన విషయానికి వస్తే తమ శాఖ కేంద్ర మంత్రి జితన్‌రామ్‌ మాంఝీ తిరు మల దర్శనానికి వస్తే ఆయన్ని స్వాగతించటానికి వెళ్లా ల్సి వచ్చిందన్నారు. అటుపై అమరావతిలో జరిగిన వివి ధ అధికారిక కార్యక్రమాల వల్ల జడ్పీ సర్వసభ్య సమా వేశానికి హాజరు కాలేకపోయానని వివరించారు. అదే జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా వివిధ అభివృద్ధి కార్యక్ర మాల వల్ల హాజరు కాలేకపోయారన్నారు. ఇది తెలు సుకోకుండా వైసీసీ నాయకులు రాజకీయ కోణంలో మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. అలాగే జిల్లా వైసీపీ కార్యాలయ స్థలం ముమ్మాటికీ విజయనగరం రాజావారిదేనని, అందుకు అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయని మంత్రి స్పష్టంచేశారు.

Updated Date - Jul 12 , 2026 | 12:16 AM