సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:19 AM
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు.
రాజాం ఎమ్మెల్యే కోండ్రు
రాజాం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి.. వినతులను స్వీకరించారు. ప్రజాదర్బార్‌లో ఇచ్చిన వినతులు సకాలంలో పరిష్కారం కాకపోతే పార్టీ కార్యాలయం చుట్టూ తిరగకుండా, గ్రామంలోని స్థానిక నాయకుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం కార్యకర్తే అధినేత కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం సంతకవిటి మండలం గరికిపాడు గ్రామానికి చెందిన మహిళకు ముఖ్యమంత్రి సహానిధి చెక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు సుమల వెంకటమన్మథరావు తదితరులు పాల్గొన్నారు.