సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
ABN , Publish Date - May 04 , 2026 | 12:14 AM
ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్, టిడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగా రాజ్రు అన్నారు.
భోగాపురం, మే 3(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్, టిడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగా రాజ్రు అన్నారు. పోలిపల్లి గ్రామంలో ఆదివారం వారు ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీక రించారు. అన్ని సమస్యలూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నలుగురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.లక్షా 58వేల 178 విలువగల చెక్కుల ను అందజేశారు. పోలిపల్లి హైస్కూల్‌లో పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన, తల్లిదండ్రు లేని ముని మహేష్‌బాబుకు ఉన్నత చదు వుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేస్తానని బంగారాజ్రు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్య క్షుడు కర్రోతు సత్యనారాయణ, నీలాపు అప్పలరామిరెడ్డి, పిడుగు తోటారావు, కోలా రామసూరి పాల్గొన్నారు.