సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:23 AM
సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తు న్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు శ్రీదేవి
గజపతినగరం, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తు న్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బా ర్ నిర్వహించారు. ప్రజల నుంచి 30 వినతులు స్వీకరించారు. ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, పీఏసీఎస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, టీడీపీ దత్తిరాజేరు మండల అధ్యక్షుడు చప్పా చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి లెంక చిన్నంనాయుడు, రామ్‌కుమార్, ప్రదీప్ పాల్గొన్నారు.