Share News

Practical Teacher ప్రయోగాల టీచర్‌

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:53 PM

Practical Teacher విద్యార్థుల్లో సైన్స్‌పై ఉన్న భయాన్ని పోగొట్టి.. ప్రాజెక్టుల రూపకల్పనలో వారిని ప్రోత్సహిస్తూ.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డు, రివార్డులు సొంతం చేసుకున్నారు బూరవిల్లి ఉమామహేశ్వరి. పాలకొండకు చెందిన ఆమె ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.

Practical Teacher ప్రయోగాల టీచర్‌
ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి

  • ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయురాలు

  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

పాలకొండ, మార్చి7(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో సైన్స్‌పై ఉన్న భయాన్ని పోగొట్టి.. ప్రాజెక్టుల రూపకల్పనలో వారిని ప్రోత్సహిస్తూ.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డు, రివార్డులు సొంతం చేసుకున్నారు బూరవిల్లి ఉమామహేశ్వరి. పాలకొండకు చెందిన ఆమె ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఆమె మార్గదర్శకత్వంలో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు ఇప్పటివరకు 12సార్లు రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఈ కారణంగా 2023లో ఆమె జాతీయ స్థాయి సారాబాయి టీచర్స్‌ సైంటిస్ట్‌ అవార్డు అందుకున్నారు. న్యూఢిల్లీలోనూ ఆమె పలుమార్లు విద్యార్థులతో కలిసి ప్రాజెక్టులను ప్రదర్శించారు. సైన్స్‌ గురు యూట్యూబ్‌ చానల్‌ ద్వారా విద్యార్థులకు అవసరమైన సైన్స్‌ సంబంధిత కంటెంట్‌ను అందిస్తున్నారు. పాఠశాలల్లో పర్యావరణహిత కార్యక్రమాలు నిర్వహించడంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు.. ఒక సైన్స్‌ పాఠ్యపుస్తక రచయితగా, దీక్షా వేదికలో కంటెంట్‌ డెవలపర్‌గానూ సేవలందిస్తున్నారు. అనేక విభాగాల్లో రా ష్ట్రస్థాయిలో రిసోర్స్‌పర్సన్‌గా పనిచేస్తూ విశేష సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి కూడా ఆమె నామినేట్‌ అయ్యారు.

Updated Date - Mar 07 , 2026 | 11:53 PM