PPR పశువులకు పీపీఆర్ ముప్పు
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:28 AM
PPR Threat to Livestock ప్రస్తుత సీజన్‌లో మేకలు, గొర్రెలకు పెస్టెడేస్ పెటిల్ రుమినెంట్ (పీపీఆర్) వ్యాధి సొకే అవకాశం ఎక్కువ. పెంపకందారులు అప్రమత్తంగా లేకుంటే పశువులు మరణించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గత నెల 27 నుంచి పశు సంవర్థక శాఖ జిల్లావ్యాప్తంగా పీపీఆర్ వ్యాక్సినేషన్ చేపడుతోంది.
జియ్యమ్మవలస, మార్చి8(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సీజన్‌లో మేకలు, గొర్రెలకు పెస్టెడేస్ పెటిల్ రుమినెంట్ (పీపీఆర్) వ్యాధి సొకే అవకాశం ఎక్కువ. పెంపకందారులు అప్రమత్తంగా లేకుంటే పశువులు మరణించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గత నెల 27 నుంచి పశు సంవర్థక శాఖ జిల్లావ్యాప్తంగా పీపీఆర్ వ్యాక్సినేషన్ చేపడుతోంది. ఈ నెల 13 వరకు ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు జేడీ డాక్టర్ మన్మథరావు తెలిపారు. పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘వాస్తవంగా ఈ వ్యాధి ఏటా జనవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో పశువుల్లో కనిపిస్తుంది. గొర్రెలు కంటే మేకలకు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. మరణాలు కూడా 50 - 70 శాతం ఉండే అవకాశం ఉంది. ఈ అంటు వ్యాధి వైరస్ వల్ల సోకుతుంది.’ అని ఆయన తెలిపారు. జిల్లాలో సీతంపేట, పాలకొండ, గరుగుబిల్లి, కురుపాం, సీతానగరం, పార్వతీపురం, సాలూరులో పశు వైద్యశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 38 పశు వైద్య చికిత్సాలయాలు, 35 గ్రామీణ పశువుల (ఆర్‌ఎల్‌యూ) యూనిట్లు ఉన్నాయి. 2019 పశు జనాభా లెక్కల ప్రకారం పశు సంపద 14.67 లక్షలు ఉండగా, వీటిలో గొర్రెలు 2,07,451, మేకలు 1,73,110 ఉన్నాయి.