పేదరికంతో చదువుకు దూరం కాకూడదు
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:09 AM
పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం తల్లిదండ్రులకు ఆర్థికంగా ఊతమిస్తూ అన్ని వసతులూ కల్పిస్తోందని ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు తెలిపారు. శుక్రవారం మండలంలోని పారాది జడ్పీ ఉన్నత పాఠశాల, బీసీ వసతి గృహాన్ని పరిశీలించారు. అనంతరం విద్యా ర్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో మోహనరావు, హెచ్‌ఎం బి.నాగేశ్వరరావు, పీడీ వెంకటనాయుడు, సీఎస్‌డీటీ సాయికృష్ణ, ఐసీడీఎస్ పీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.
బొబ్బిలి రూరల్, ఆగస్ట్ 7(ఆంధ్రజ్యోతి): పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం తల్లిదండ్రులకు ఆర్థికంగా ఊతమిస్తూ అన్ని వసతులూ కల్పిస్తోందని ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు తెలిపారు. శుక్రవారం మండలంలోని పారాది జడ్పీ ఉన్నత పాఠశాల, బీసీ వసతి గృహాన్ని పరిశీలించారు. అనంతరం విద్యా ర్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో మోహనరావు, హెచ్‌ఎం బి.నాగేశ్వరరావు, పీడీ వెంకటనాయుడు, సీఎస్‌డీటీ సాయికృష్ణ, ఐసీడీఎస్ పీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఫరామభద్రపురం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): పిల్లల పౌష్టికాహారం నాణ్యత, వసతి కేంద్రాల పరిపరాల పరిశుభ్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు తెలిపారు రామభద్రపురం అగురువీధిలోని చౌకధరల దుకాణంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి రెండునెలలుగా హాజరు పట్టిక సక్రమంగా లేకపోవడంతో అంగన్‌వాడీ టీచర్‌కు మెమో జారీ చేశారు. తర్వాత రామభద్రపురంలోని ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీచేశారు. స్టాకు రికార్డులో అదనపు రైస్ ఉండడం గమనించి వార్డెన్‌కు మెమో జారీ చేశారు. చౌక ధరల దుకాణంలో మెట్రాలజీ సర్టిఫికెట్ లేని కారణంగా, డిపోలో ప్లాస్టిక్ బ్యాగులో రైసు ఉండడం గమనించి మెమో జారీ చేశారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జికి చార్జిమెమో జారీ
బొబ్బిలి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి సివిల్ సప్లయిస్ ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జికి చార్జిమెమో జారీచేయాలని ఈ శాఖ అధికారులను రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు ఆదేశించారు. శుక్రవారం బొబ్బిలి సివిల్ సప్లయిస్ ఎంఎల్ ఎస్ కేంద్రాన్ని పరిశీలించారు. ఇక్కడ ఆహారధాన్యాల స్టాకు బోర్డులు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్రం ఇన్‌చార్జికి చార్జిమెమో జారీచేయాలని సివిల్‌సప్లయిస్ అధికారులను ఆదేశించారు. రేషన్‌డిపోలకు అందించే సరుకులను తూనిక వేసి ఇవ్వాలని కోరారు. అనంతరం బొబ్బిలిలోని కేజీబీవీ, ప్రభుత్వ గురుకుల పాఠశాల, ట్రైబల్‌వెల్ఫేర్ హాస్టల్, ఆశ్రమపాఠశాల, సంక్షేమ హాస్టళ్లను కాంతారావు తనిఖీచేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ డిపోలు పరిశీలించారు. ఆయన వెంట సీఎస్‌డీటీ రెడ్డి సాయికృష్ణ, ఐసీడీఎస్ అధికారులు ఉమాభారతి, జె.విజయలక్ష్మి, వివిధశాఖల అధికారులు ఉన్నారు.