Share News

యోగా దినోత్సవంపై పోస్టర్‌ తయారీ పోటీలు

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:06 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్క రించుకుని జాతీయ జనాభా విద్యా ప్రాజెక్టు ఆధ్వర్యంలో జిల్లాలోని 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు పోస్టర్‌ తయారీ పోటీలు నిర్వహిస్తున్నట్టు డైట్‌ ప్రిన్సిపాల్‌ డా.కె.రామకృష్ణరావు తెలిపారు.

యోగా దినోత్సవంపై పోస్టర్‌ తయారీ పోటీలు

  • నేడు పాఠశాల స్థాయిలో నిర్వహణ

నెల్లిమర్ల, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్క రించుకుని జాతీయ జనాభా విద్యా ప్రాజెక్టు ఆధ్వర్యంలో జిల్లాలోని 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు పోస్టర్‌ తయారీ పోటీలు నిర్వహిస్తున్నట్టు డైట్‌ ప్రిన్సిపాల్‌ డా.కె.రామకృష్ణరావు తెలిపారు. ఆరోగ్యానికి యోగా-పాఠశాలలో యోగా అనే అంశంపై పోస్టర్‌ తయారీ పోటీలను పాఠశాల స్థాయిలో ఈనెల 16న నిర్వహించాలన్నారు. పాఠ శాల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన ఒకొక్కరిని జూన్‌ 17న ఉదయం 9 గంటలకు నిర్వహించే మండల స్థాయి పోటీలకు సంబంధిత ఎంఆర్‌సీలకు పంపాలన్నారు. మం డల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు జూన్‌ 18న ప్రభుత్వ ఎంఆర్‌ ఎస్‌కేటీ హైస్కూల్‌లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తారని చెప్పారు. పోస్టర్‌ తయారీకి అవసరమైన డ్రాయింగ్‌ షీట్‌, క్రేయాన్స్‌, స్కెచ్‌ పెన్స్‌, వాటర్‌కలర్స్‌, పెన్సిల్స్‌ విద్యార్థులే సమకూర్చుకోవాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్‌ 21న జిల్లా స్థాయిలో ఎంపికైన పోస్టర్లను ప్రదర్శించి మెరిట్‌ సర్టిఫికెట్లతో పాటు ప్రథమ బహుమతి వెయ్యి రూపాయలు, ద్వితీయ బహుమతి రూ.750, తృతీయ బ హుమతి రూ.500 చొప్పున అందజేస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు 94440 338045కు సంప్రదించాలని కోరారు.

Updated Date - Jun 16 , 2026 | 12:06 AM