Share News

ఇళ్ల పట్టాల కోసం పోస్టుకార్డు ఉద్యమం

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:22 AM

నగరంలోని ధర్మపురి సర్వే నెంబరు 26లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, టీవోటీని అమలు చేయాలని కోరుతూ పట్టణ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి నారాయణరావు ఆధ్వర్యంలో శుక్రవారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు.

ఇళ్ల పట్టాల కోసం పోస్టుకార్డు ఉద్యమం

విజయనగరం దాసన్నపేట, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): నగరంలోని ధర్మపురి సర్వే నెంబరు 26లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, టీవోటీని అమలు చేయాలని కోరుతూ పట్టణ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి నారాయణరావు ఆధ్వర్యంలో శుక్రవారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవోటీ చట్ట ప్రకారం తీసుకున్న 3.77 ఎకరాల భూమిలో పేదలకు పట్టాలు ఇవ్వాలని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా నేరుగా జీవోని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్గదర్శకాల మార్పునకు పునరాలోచన చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోస్టుకార్డులను పంపించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 12:22 AM