Share News

పోస్టల్‌ సేవలు డ్వాక్రా మహిళలకు అందజేయాలి

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:13 AM

డ్వాక్రా మహి ళలకు రుణాలు అందించే విధంగా పోస్టల్‌ డిపార్ట్‌మెం ట్‌ సేవలు అందజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

పోస్టల్‌ సేవలు డ్వాక్రా మహిళలకు అందజేయాలి

  • మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

గజపతినగరం, జూన్‌7(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా మహి ళలకు రుణాలు అందించే విధంగా పోస్టల్‌ డిపార్ట్‌మెం ట్‌ సేవలు అందజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం స్థానిక ఉష కన్వెన్షన్‌ పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్‌లెన్స్‌ అవార్డు కార్యక్ర మానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్‌ ద్వారా డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు అందజేస్తుం దని.. అలాగే కేంద్ర సహకారంతో రుణాలు అందించే దిశగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలి పారు. అనంతరం మండలంలోని లోగిస గ్రామానికి చెందిన తలుపుల తులసి కుటుంబానికి రూ.50లక్షల చెక్కును అందజేశారు. గతంలో ఏడాదికి రూ.2600 ప్రీమియం చెల్లించి ప్రమాదవశాత్తు మృతిచెందిన కుటుంబానికి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంద న్నారు. అనంతరం పొదుపు పథకాలను ఉపయోగిస్తు న్న ఉత్తమ ఖాతాదారులకు పాస్‌ పుస్తకాలను అందజే శారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి మెమోంటోలు అందజేశా రు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురా లు గంట్యాడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్‌ పీవీవీ గోపాలరా జు, విజయనగరం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.శ్రీనివాస్‌, ఐపీపీబీ ప్రాంతీయ అధికారి సురేష్‌, సబ్‌ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉపేంద్ర, బ్రాంచ్‌ మేనేజర్‌ సతీష్‌, సబ్‌ పోస్టుమార్లు, పోస్టల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 12:13 AM