Share News

Postal Services గిరిజనుల చెంతకు తపాలా సేవలు

ABN , Publish Date - May 15 , 2026 | 11:41 PM

Postal Services Reach Tribal Communities గిరిజన ప్రాంత ప్రజలకు తపాలా సేవలను అందజేయాలని విశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌.నవీన్‌ కుమార్‌ సూచించారు. శుక్రవారం స్థానిక ఎన్జీవో హోంలో పార్వతీపురం సబ్‌ డివిజన్‌ పరిధిలోని తపాలా ఉద్యోగులతో సమీక్షించారు.

Postal Services   గిరిజనుల చెంతకు తపాలా సేవలు
సమావేశంలో మాట్లాడుతున్న నవీన్‌ కుమార్‌

బెలగాం, మే15(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంత ప్రజలకు తపాలా సేవలను అందజేయాలని విశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌.నవీన్‌ కుమార్‌ సూచించారు. శుక్రవారం స్థానిక ఎన్జీవో హోంలో పార్వతీపురం సబ్‌ డివిజన్‌ పరిధిలోని తపాలా ఉద్యోగులతో సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం గుమ్మలక్ష్మీపురం, కురుపాం, మొండెంకల్లు, కొమరాడ పరిధిలో పోస్టాఫీస్‌ల ద్వారా గిరిజనులకు అన్ని రకాల సేవలు అందించాలన్నారు. ఆర్థిక సేవలతో పాటు ఇన్సూరెన్స్‌ , ఆధార్‌ సేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను చేరవేయాలని సూచించారు. తపాలా సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో పార్వతీపురం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 11:41 PM