ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:31 AM
రామభద్రపురం, బొబ్బిలి, బాడంగి ఎంపీడీవో కార్యాలయాల్లో శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రామభద్రపురం, బొబ్బిలి, బాడంగి ఎంపీడీవో కార్యాలయాల్లో శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఫరామభద్రపురం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రామభద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్ నిర్వహించారు.ఈ మేరకు సాయంత్రం ఐదు గంటలకు 153 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు సంబంధించి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్.విష్ణు ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రత్నం, తహసీల్దార్ అజురఫీజాన్, ఏవో సన్యాసిరావు, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ చొక్కాపు శ్రీరాములునాయుడు, జూనియర్ అసిస్టెంట్ చిట్టూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఫబొబ్బిలి రూరల్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల ఓటు హక్కు వినియోగించేందుకు బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఏడు నుంచి సాయంత్ర ఐదు గంటల వరకు ఈ కేంద్రం పనిచేసినట్లు ఎంపీడీవో పోతుల రవికుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కాగా మొత్తం 212 మంది ఉద్యోగులు ఓటు వేసినట్లు అధికారులు తెలిపారు.
ఫబాడంగి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఉద్యోగులు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా తమ ఓట్లను శుక్రవారం వినియోగించుకున్నారు. ఈ మేరకు 176 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఎన్నికల అధికారి కె.మహరాజన్ తెలిపారు.