గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:07 AM
ఒడిశా నుంచి కేరళ రాష్ట్రానికి కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని డెంకాడ పోలీసులు అదుపు లోకి తీసుకుని, వారి వద్ద నుంచి 76.530 కిలోల గంజాయిని స్వాధీనం చేసు కున్నారని ఎస్పీ ఏఆర్.దామోదర్ తెలిపారు.
డెంకాడ, విజయనగరం క్రైం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి కేరళ రాష్ట్రానికి కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని డెంకాడ పోలీసులు అదుపు లోకి తీసుకుని, వారి వద్ద నుంచి 76.530 కిలోల గంజాయిని స్వాధీనం చేసు కున్నారని ఎస్పీ ఏఆర్.దామోదర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన గురువారం ఈ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా అందిన సమాచారం మేరకు డెంకాడ పోలీసులు, ఈగల్ సిబ్బంది గురువారం డెంకాడ మండలం బొడ్డవలస జంక్షన్ వద్ద వాహ న తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి కేరళ రాష్ట్రానికి కారులో గంజాయిని తర లిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 గోనెసంచులలో గల 76.530 కిలోల గంజాయి, కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులది కేరళ రాష్ట్రం కసర్‌గడ్ జిల్లా ఉప్పల గ్రామానికి చెందిన మోయిదీన్ నవాజ్, సయ్యద్ జంషీద్‌గా విచారణలో గుర్తించారు. వీరు ఒడిశా రాష్ట్రం, సిమి లిగూడలో గంజాయి కొనుగోలు చేసి, కేరళ రాష్ట్రానికి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. నిందితులపై ఫైనాన్సియల్ ఇన్వెస్టిగేషన్, పీటీ ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం దర్యాప్తు చేస్తా మని, పీడీ చట్టాన్ని కూడా ప్రయోగిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో క్రియా శీలంగా పనిచేసిన భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, డెంకాడ ఎస్‌ఐ ఎ.స న్యాసినాయుడు, ఈగల్ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందిం చారు. ఈ సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, డెంకాడ ఎస్‌ఐ ఎ.సన్యా సినాయుడు, ఈగల్ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.