చేపల పెంపకానికి చెరువులు అప్పగించాలి
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:58 PM
పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులను చేపల పెంపకానికి అప్పగించాలని కొండగంగుబూడి గిరిజన యువకులు కోరారు.
వేపాడ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులను చేపల పెంపకానికి అప్పగించాలని కొండగంగుబూడి గిరిజన యువకులు కోరారు. ఈ మేరకు సోమవారం బొద్దాం-కొండంగుబూడి రహదారిలో జిల్లా రైతు ఉద్యమ నాయకుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో గిరిజన యువకులు రాస్తారోకో నిర్వహిం చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 13 రోజులుగా కొండగంగుబూడి పంచా యతీలోగల 12 గిరిజన గ్రామాల ఎస్సీ, ఎస్టీ యువకులు కుటుంబ సభ్యులతో ఆందోళన నిర్వహిస్తున్నా జిల్లా మత్సశాఖ అధికారులు, కలెక్టర్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేదాటి గిరి, జన్ని దారప్ప, మురగ బోయిన దేముడు, కంబాల అచ్చిబాబు, జన్ని ముత్యాలు, జన్ని అప్పలకొండ, కంబాల పెంటయ్య, బద్నాన అగ్నేష్ పాల్గొన్నారు.