పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు ఉండకూడదు
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:12 AM
స్థానిక రాజీవ్ స్టేడియంలో ఏర్పాటుచేసిన బ్యాలెట్ బాక్స్‌ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ర్టాంగ్ రూమ్ లను కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ శని వారం పరిశీలించారు.
విజయనగరం, కలెక్టరేట్ అక్టోబరు 17(ఆంధ్రజ్యో తి): స్థానిక రాజీవ్ స్టేడియంలో ఏర్పాటుచేసిన బ్యాలెట్ బాక్స్‌ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ర్టాంగ్ రూమ్ లను కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ శని వారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది కేటాయింపు, పోలింగ్ సామగ్రి పంపిణీ, వాహనాలు రాకపోకలు, బారికేడ్లు, సీసీ కెమెరాల నిఘా, స్ట్రాంగ్ రూమ్‌లు భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిం చారు. డ్రిస్టిబ్యూషన్,రిసెప్షన్ సెంటర్లను ప్రణాళికా బద్దంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడా లన్నారు. సుమారు 108 బస్సులు రానున్నందున, వాటి పార్కింగ్ , సామగ్రితో సిబ్బంది నిర్దేశిత బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేలా వాహ నాల రాకపోకలను నియంత్రించాల న్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాల స్వామి, ఇంజనీరు ప్రసాద్, డీఐవో సింహా చలం పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు, సమస్యలను స్వీకరించేందుకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ 08922-236947, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ 98499 06486, బొబ్బిలి మున్సిపాల్టీలో 79956 27204, నెల్లిమర్ల నగర పం చాయతీలో 08922-244248 నెంబర్లను సంప్రదించాల ని ఆయన సూచించారు.
ఎన్నికల పరిశీలకుల నియామకం
మున్పిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా ఎన్. తేజ్‌భరత్, ఐఏఎస్ (కార్యదర్శి, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల శాఖ), ఎన్నికల వ్యయ పరి శీలకులుగా ఎస్.వెంకటేష్, ఐఎఫ్‌సీ (జిల్లా అటవీ అధికారి శ్రీకాకుళం)ని నియమించారు.