అంగన్‌వాడీ కార్యకర్తలపై రాజకీయ జోక్యం తగదు
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:09 AM
అంగన్‌వాడీ కార్య కర్తలపై రాజకీయ జోక్యం తగదని ఆ యూనియన్ జిల్లా గౌరవ అఽధ్యక్షురాలు వి.లక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్, రాజాం ప్రొజెక్టు కమిటీ నాయకు రాలు సీహెచ్ రూపాదేవి డిమాండ్ చేశారు.
రాజాం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కార్య కర్తలపై రాజకీయ జోక్యం తగదని ఆ యూనియన్ జిల్లా గౌరవ అఽధ్యక్షురాలు వి.లక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్, రాజాం ప్రొజెక్టు కమిటీ నాయకు రాలు సీహెచ్ రూపాదేవి డిమాండ్ చేశారు. గురువా రం స్థానిక ఐసీడీఎస్ ప్రొజెక్టు కార్యాలయం ఆవరణలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసంద ర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రొజెక్టులలో ఒక్క రాజాంకు తప్ప అన్ని ప్రాజెక్టులలో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న సంగాం, మరువాడ, కింజంగి, ఇరువడా ఆయాల కు పదోన్నతి కల్పించకుండా అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. జీవో నెం-2 పనులు తక్షణమే అమ లు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించా రు. స్థానిక ఐసీడీఎస్ పీడీ సన్యాస మ్మకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ అధ్యక్షురాలు జయలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.త్రినాథ, సెక్టార్ నాయకులు పాల్గొన్నారు.