పుల్లిటలో పోలీసుల పరిశీలన
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:18 AM
మామిడిపల్లి గ్రామంలో కొన్నిరోజుల కిందట ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే.
సంతకవిటి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): మామిడిపల్లి గ్రామంలో కొన్నిరోజుల కిందట ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మృతికి పుల్లిట గ్రామానికి చెందిన పిన్నింటి అన్నారావు కారణమని భావించిన మృతుడి కుటుంబ సభ్యులు.. ఆయనకు చెంది న మామిడి, టేకు చెట్లను యంత్రాల సహాయంతో బుధవారం నరికివేశారు. దీంతో అన్నారావు భార్య స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈక్రమంలో శుక్రవారం పుల్లిట గ్రామంలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, రాజాం టౌన్ సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ ఆర్.గోపాలరావు పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. గ్రామాల్లో ఎటువంటి ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.