Share News

ఇంటి వద్దకే పోలీసు సేవలు

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:22 AM

ప్రభుత్వం డిజిటల్‌ పాలనలో భాగం గా ప్రజలు ఇంటి నుంచే పోలీసు సేవలు పొందేందుకు వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఎస్పీ దామోదర్‌ తెలిపారు.

ఇంటి వద్దకే పోలీసు సేవలు
జిల్లా ఎస్పీ దామోదర్‌

విజయనగరం క్రైం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం డిజిటల్‌ పాలనలో భాగం గా ప్రజలు ఇంటి నుంచే పోలీసు సేవలు పొందేందుకు వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఫీచర్లను అందుబాటు లోకి తీసుకువచ్చిందని ఎస్పీ దామోదర్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖ సేవలు, ఎఫ్‌ఐఆర్‌, ఎఫ్‌ఐఆర్‌ ప్రస్తుత స్థితి, ఈ చలానా వివరా లు సంబంధిత స్టేషన్‌కు వెళ్లకుండా సులభం గా పొందవచ్చునన్నారు. ఈ వాట్సాప్‌ గవర్నె న్స్‌ సేవలు పొందేందుకు ప్రజలు ముందుగా 95523 00009 నెంబరును సేవ్‌ చేసుకోవా లని, ఆ నెంబరుకు హాయ్‌ అని మేసేజ్‌ చేయ గానే వివిధ రకాల ప్రభుత్వ సేవలు, వివరాలు వస్తాయని వెల్లడించారు. ఇందులో పోలీసుశాఖ సేవలను ఎంపిక చేసుకుని ఎఫ్‌ఐఆర్‌, ఎఫ్‌ఐఆర్‌ స్థితి, ఈ చలానా వివరాలు ఇంటి నుంచే పొందవచ్చునన్నారు. క్యూ ఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి కూడా పోలీసు సేవలు తక్షణమే తెలుసుకోవచ్చని తెలిపారు. క్యూర్‌ కోడ్‌ని అన్ని పోలీసుస్టేషన్లలో అందుబాటులో ఉందన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 12:22 AM