తల్లి చెంతకు కుమార్తెను చేర్చిన పోలీసులు
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:09 AM
కుమార్తె కనిపించడం లేదని ఆందోళన చెందిన తల్లి చెంతకు.. బాలికను మహిళా పోలీసులు చేర్పించారు.
బెలగాం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): కుమార్తె కనిపించడం లేదని ఆందోళన చెందిన తల్లి చెంతకు.. బాలికను మహిళా పోలీసులు చేర్పించారు. ఈ ఘటన పార్వతీ పురంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన పిల్లి రజని 11 ఏళ్ల తన కుమార్తెతో విజయనగరం శుక్రవారం వచ్చింది. పనులు ముగించుకుని స్వగ్రామానికి బస్సులో బయలుదేరింది. బొబ్బిలి వద్దకు వచ్చే సరికి తన కుమార్తె దాహంగా ఉందనడంతో కూల్ డ్రింక్ కోసం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆమె బస్సు దిగింది. తిరిగి పార్వతీపురం బస్సు కాకుండా సాలూరు బస్సు ఆమె ఎక్కింది. కొద్దిదూరం వెళ్లిన తర్వాత కుమార్తె బస్సు లో కనిపించక పోవడంతో కంగారు పడింది. తుదకు అదే బస్సులో ఆమె పార్వతీపురం చేరుకుంది. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తన కూ తురు బస్సు నుంచి దిగలేదని తెలుసుకుని ఆందోళనతో అక్కడే పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ పెంటయ్యకు విషయం చెప్పింది. దాంతో మహిళా పోలీసస్టేషన్ సిబ్బంది బొబ్బిలి ఆర్టీసీ సిబ్బం దితో మాట్లాడారు. బాలిక బొబ్బిలి బస్టాండ్‌లో ఉందని తెలుసుకుని సురక్షి తంగా ఆర్టీసీ బస్సులో పార్వతీపురం రప్పించి తల్లికి అప్పగించారు. తన కూతురును సురక్షితంగా అప్పగించిన మహిళా పోలీస్‌స్టేషన్ సిబ్బందికి ఆమె ధన్య వాదాలు తెలిపారు.